తూప్రాన్ మున్సిపల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం
తూప్రాన్, మార్చి 5 : తూప్రాన్ ప్రధాన రహదారి పై ప్రతి రోజు ట్రాఫిక్ వలన గొడవలు జరగడం ఆనవాయితీగా మారింది. తూప్రాన్ మున్సిపల్ ప్రధాన పట్టణం కావడంతో హైదరాబాద్ నుండి నిజాంబాద్ వరకు ఆర్టీసీ బస్సులు వివిధ వాహనాలు అధిక మొత్తంలో వెళుతూ ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తూప్రాన్ ప్రధాన రహదారి పూర్తిగా ట్రాఫిక్ తో స్తంభించడం జరుగుతుంది. ముఖ్యంగా జాతీయ రహదారి ఇరువైపులా 50 ఫీట్లు ఉండగా కొందరు వ్యాపారస్తులు ప్రధాన రహదారిని అక్రమంగా కబ్జా చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.
గతంలో పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అప్పటి మందమే చర్యలు తీసుకొని వదిలేయడం జరిగింది. ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకోవడం వాహనాలు ఢీకొట్టుకోవడం లాంటివి జరిగి గొడవకు దిగుతున్నా బాధితులు ఈ నేపథ్యంలో రహదారి పూర్తిగా రద్దీ ఏర్పడుతూ బాటసార్లకు వాహన దారులకు ప్రయాణికులకు తీరని అంతరాయం ఏర్పడడం జరుగుతుంది. ఇది ఇలా కొనసాగితే రానున్న రోజుల్లో తీరని నష్టం వాటిల్లి ప్రమాదాలకు నిలయంగా మారడం జరుగుతుంది. ఇకనైనా మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికార యంత్రాంగం తక్షణమే ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు చేపట్టాలి. అక్రమంగా రహదారిని కబ్జా చేసిన వారిని నియంత్రించాలి.




