6 March, 2026 | 12:33 PM

అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం పెరగాలి

06-03-2026 01:43 AM

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

జిన్నారంలో పాఠశాల భవనం ప్రారంభం

జిన్నారం(అమీన్‌పూర్), మార్చి 5 : అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జి న్నారం మున్సిపల్ కేంద్రంలో న్యూలాండ్  పరిశ్రమ సౌజన్యంతో 57 లక్షల రూపాయల అం చనా వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని గురువారం ఉద యం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంతో పాటు ఆధునిక వసతులతో భవనాలు నిర్మించి విద్యార్థులకు కార్పోరేట్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు సైతం ఉన్నత లక్ష్యంతో చదివి. పుట్టిన ఊరికి కన్న తల్లిదండ్రులకు పేరు  ప్రఖ్యాతలు తీసుకొని రావాలని కోరా రు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రె డ్డి, కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు, పరిశ్రమ ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.