13 August, 2026 | 9:44 PM

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

13-08-2026 09:02 PM

చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూరు గోదావరి నుంచి గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లను పట్టుకున్నట్లు చెన్నూర్ పట్టణ సిఐ బన్సీలాల్ తెలిపారు. తమ సిబ్బంది రాత్రి వేళ పెట్రోలింగ్ చేస్తుండగా వారికి అందిన సమాచారం మేరకు గోదావరి నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లను చెన్నూర్ మండలం రాయపేట వద్ద పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లు, యాజమానులపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగిందని సీఐ బన్సీలాల్, ఎస్ ఐ శ్యాంపటేల్ తెలిపారు.