29 June, 2026 | 1:34 AM

భద్రకాళి సన్నిధిలో టీపీఎస్‌సీ చైర్మన్

29-06-2026 12:00 AM

వరంగల్, జూన్ 28 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ అమ్మవారిని తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్  బుర్రా వెంకటేశం కుటుంబ సమేతంగా దర్శించుకున్నా రు. ఆలయానికి విచ్చేసిన బుర్రా వెంకటేశం కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభం, మంగళవాద్యాల తో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ఆలయ మహామండ పంలో మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాద ములు అందజేశారు.