29 June, 2026 | 12:30 AM

న్యూబోయిన్ పల్లి టూ వీలర్ మెకానిక్‌ల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

29-06-2026 12:00 AM

గెలుపొందిన మెకానిక్ అసోసియేషన్ టీం

సికింద్రాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): మేము మెకానిక్ లు మేము, క్రికెట్లో మా సత్తా చూపిస్తాం అంటూ రంగంలోకి దిగి కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్ లో బోయిన్ పల్లి టూవీలర్ మెకానిక్ అసోసియేషన్ టీం, ఆటోమొబైల్ శ్యామ్ టీం మధ్య ఫ్రెండ్లి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ కి ముఖ్యఅతిథిగా బండి శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం జరిగిన మ్యాచులో  బోయిన్ పల్లి టు వీలర్ మెకానిక్ అసోసియేషన్ టీం విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో ప్రెసిడెంట్ మహేష్,ఆటోమొబైల్ శ్యామ్ డేవిడ్, శ్రీనివాస్, సునీల్, అప్రోచ్, సర్దార్ జి, సమీర్, గోపి, విజయ్,తదితరులు పాల్గొన్నారు.