29 July, 2026 | 10:46 PM

గురుపౌర్ణిమ వేడుకల్లో సాయిబాబా ఆశీస్సులు పొందిన మున్సిపల్ చైర్మన్

29-07-2026 10:03 PM

నర్సాపూర్:  గురుపౌర్ణిమ సందర్భంగా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్ ఆలయాన్ని సందర్శించి శ్రీ సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం ప్రజలు అందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. గురుపౌర్ణిమ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గురువుల బోధనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొంటూ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.