29 July, 2026 | 10:45 PM

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు

29-07-2026 09:54 PM

త్రుటిలో తప్పిన ప్రమాదం 

ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అడ్లూరు రోడ్ లో బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న వాహనాల కు సైడు ఇచ్చి రోడ్డు పక్కకు దిగడంతో బురదమయంగా ఉన్న రోడ్డు లో బస్సు చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కామారెడ్డి నుంచి అడ్లూరు, పోసానిపేట్, వ యా గిద్ద వరకు ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళుతుండగా అడ్లూరు రోడ్డులో రోడ్డు కింద బురదలో బస్సు  కూరుక పోయింది.

బస్సు డ్రైవర్ సమయ స్ఫూర్తిగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. రోడ్డుకిరువైపులా మట్టి వేయాల్సి న కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో వర్షాలు కురవడంతో బురద మాయంగా మారి ంది. దీంతో బస్సు బురద లో చిక్కుకుంది. ప్రయాణికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదం వాటిల్లకుండా ప్రయాణికులు బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు కు ఇరువైపులా మొరం మట్టి ని అధికారులు వేయించాలని స్థానికులు కోరారు.