ఇంటికో ఉద్యోగం ఏది?
19-07-2026 12:53 AM
ఎవరెన్నీ ఉద్యోగాలిచ్చారో చర్చిద్దామా?
కేటీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): ఇంటికో ఉద్యోగం అన్నది కేసీఆరేనని, కానీ కేటీఆర్ ఇప్పుడు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, 10 ఏళ్లలో దోపిడీ చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ఉద్యోగాలకు తాము రెండేండ్లలో ఇచ్చిన ఉద్యోగాలపై చర్చిద్దామా? అని సవాల్ విసిరారు.
శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 70 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఉ ద్యోగులను పిలిచి నియామక పత్రాలు ఇచ్చామని, మీ కుటుంబంలో ఉద్యోగాలు వచ్చాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదన్నారు. తమ ప్రభుత్వంపై త ప్పు డు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.






