ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం
బీఆర్ఎస్ పార్టీ ముక్కలైంది.. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లి తప్పుచేశారు
తెలంగాణలో బీజేపీకి ఆదరణ లేదు
ముగులులో కాంగ్రెస్ కార్యకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడు సమావేశం
హైదరాబాద్: ములుగు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడు సమావేశం నిర్వహించారు. అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్(TPCC President) పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 100 స్థానాలు గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ముక్కలైందని, ఆస్తుల కోసం కోట్టుకుంటున్నారని మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు. బీజేపీకి తెలంగాణలో ఆదరణ లేదని సూచించారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లి తప్పుచేశారని ఆయన ఆరోపించారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడి అందులోనే చేరారని విమర్శించారు. కాంట్రాక్టర్లు నుంచి కమీషన్లు తీసుకోవడం వల్లే కాళేశ్వరం కూలిపోయిందని పేర్కొన్నారు.
ములుగు గట్టమ్మ ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్
ములుగు జిల్లా పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి సీతక్కతో కలిసి గట్టమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఆలయానికి విచ్చేసిన టీపీసీసీ చీఫ్, మంత్రి సీతక్కకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభంతో ఆహ్వానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమం సందర్భంగా స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




