14 August, 2026 | 4:48 PM

గీత దాటితే సీఎంతో సహా అందరూ ఒకటే: రాజగోపాల్‌పై పీసీసీ చీఫ్‌ ఆగ్రహం

14-08-2026 03:43 PM

హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Mahesh Kumar Goud) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డితో సహా ఎవరికైనా ఒకటే గౌరవమని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డికి కూడా అదే గౌరవం ఇస్తున్నామని తెలిపారు. సమయం వచ్చినప్పుడు వాళ్లకి అవకాశాలు ఉంటాయని చెప్పారు. అధిష్ఠానం హామీ ఇచ్చింది.. ఆ స్థాయిలో వాళ్లు చూసుకుంటారని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి ఆవేదన, ఆందోళన అర్థం చేసుకుంటామన్నారు.

నాలుగు గోడల మధ్య పార్టీ ఫోరంలోని అంశాలు బహిరంగంగా మాట్లాడకూడదని మహేశ్ గౌడ్ వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి ప్రజానాయకుడు, నాకు మంచి మిత్రుడు అని మహేశ్ గౌడ్ తెలిపారు. పార్టీ గీత దాటితే సీఎం సహా ఎవరినైనా సహించేది లేదని సూచించారు. రాజగోపాల్ రెడ్డి గీత దాడి మాట్లాడకూడదు.. ఆయన అలా మాట్లాడడం సరికాదన్నారు. ఏం మాట్లాడినా అధిష్ఠానం దృష్టికి పోతుందని మహేశ్ గౌడ్ తెలిపారు. బిల్లుల విషయంలో ఒక క్రమపద్ధతిలో ముందుకెళ్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగా తాము చేయలేదన్న మహేష్ గౌడ్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ ఇన్‌చార్జ్ దృష్టికి తీసుకెళ్లి చర్యలపై చర్చిస్తానని వ్యాఖ్యానించారు. మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) దృష్టికి తీసుకెళ్తామన్నారు. తమిళనాడు రాజకీయాలు చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పారు. తమిళనాడు వేరు, తెలంగాన వేరని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.