ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్సీ దండే విఠల్
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడలో సుమారు రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ కాపువాడ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా రహదారి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసింది. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరేలా పనిచేస్తున్నామని తెలిపారు .రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, 6వ వార్డు కౌన్సిలర్ ఎమ్మాజీ శారద సంతోష్ , అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.






