24 June, 2026 | 2:28 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం

24-06-2026 01:26 PM

అయిజ జూన్ 23 : అయిజలోని ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి ఇది. ప్రభుత్వ ఆసుపత్రి  అంటేనే రోగులు పేదలు , పిల్లలు, ముసలి వాళ్లు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్లు వైద్యం కోసం వస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేద రోగులకు ప్రాణాలు నిలిపే ఆలయం. అటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టిక్ ట్యాంకుల కోసం త్రవ్విన గుంతలు సుమారు రెండు నెలలు కావస్తున్న ఇంతవరకు పని పూర్తి చేయకపోవడం అధికారులు అసమర్థతనా ? లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా ? ప్రాణాలు నిలిపే ప్రభుత్వ ఆసుపత్రికె ఈ దుస్థితి ఏర్పడితే మిగతా ప్రభుత్వ ఆఫీసుల దగ్గర, రోడ్లపై నిర్మాణాత్మకమైన పనుల పరిస్థితి ఏమిటని ప్రజల ప్రశ్నిస్తున్నారు ? ఆసుపత్రికి అనుసంధానం చేస్తూ అవతల 12 పడకలుగల గదులు ఉండడంవల్ల డాక్టర్లు చూసిన పేషెంట్లు ఆ పడకల దగ్గరకు వెళ్లి సెలైన్ బాటిల్ ఎక్కించుకోవడం జరుగుతుంది.

అటువంటి రూములకు ముసలి వాళ్లు గర్భిణీ స్త్రీలు ఆ గుంతలను దాటి అవతలకు వెళ్లడం దాదాపు వారి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నట్లేనని పేషెంట్లకు జతగా వచ్చిన బంధువులు ఆరోపిస్తున్నారు. దానితో ఈ మార్గం గుండా ముసలి వాళ్లు గర్భిణీ  స్త్రీలు రాకపోకలు సాగించడం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ప్రస్తుతం వారంకాల సీజన్ కాబట్టి వర్షాలకు గుంతలు నీటితో నిండిపోతే దారి ఎక్కడుందో కూడా తెలియని దుస్థితి. ఇట్టి విషయం అధికారులకు కూడా కనీస స్పందన లేకపోవడం దురదృష్టకరమని స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇట్టి పనులను జిల్లాస్థాయి అధికారులైన శ్రద్ధ వహించి త్వరగా పూర్తిచేసి రోగులకు ఇబ్బంది కలగకుండా చేయాలని ఇలా  ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే రోగులను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.

 పనులు త్వరగా పూర్తి అయితే ఇబ్బందులు ఉండవు... డాక్టర్ కిరణ్ 

 పేషెంట్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎన్నిసార్లు ఏ ఈ లకు కాంట్రాక్టర్లకు చెప్పిన చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టేనని పనులు త్వరగా పూర్తి అయితే మాకు ఇబ్బంది ఉండదు 

బిల్లులు రానందున పనులు చేయడం లేదు.... ఏ ఈ శ్రీనివాసులు 

ఈ పనిచేస్తున్న కాంట్రాక్టర్ తో ఇది ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు గర్భిణీ స్త్రీలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతాయి. త్వరగా పూర్తి చేయమని ఎంత చెప్పినా ?  నాకు చేసిన పనికి బిల్లులు రావడం లేదు నేనేమీ చేయలేను అంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తెశారు.