8 July, 2026 | 5:05 PM

Breaking News

ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •  

సమాజానికి సేవలు అందించే దిశగా..

02-02-2026 12:43 AM

ఘట్ కేసర్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : సమాజానికి అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా విద్యార్థులకు  మార్గదర్శనం చేసే విధంగా ఆధ్యాపకులు శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ దివ్వ నల్ల అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి దివ్యానగర్ లోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 30, 31 తేదిలలో నిర్వహించిన జాతీయ స్థాయి ఎపిక్స్ వరాపు విజయవంతంగా జరిగినట్లు ఆమె తెలి పారు.

మొదటి రోజు శుక్రవారం ప్రభాత అమెరికన్ యూనివర్సిటీ పర్డ్యూ తో ఎన్‌ఎంఆర్‌ఎసి అవగాహణ ఒప్పందం జరిగిన సందర్భంగా ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ విలియం ఓక్స్ తో పాటు దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, సాంకేతిక కళాశాలలకు చెందిన దాదాపు 50 మంది ప్రొఫెసర్లు హాజరయ్యారు. ఈ ప్రారంభం కార్యక్రమంలో విలియం ఓక్స్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ ప్రాజెకట్స్ ఇన్ కమ్యూనిటీ సర్వీసెస్( ఎ పిక్స్) ప్రత్యేక పాఠ్యాం శంగా చేశామని గుర్తు చేశారు.

ఒప్పందంకు అనుగుణంగా పర్డ్యూ యూనివర్సిటీ అన్ని రకాల సహకారం కళాశాలకు అందిస్తుందని, దీనిలో భాగంగానే జాతీయ స్థాయి వర్క్ షాప్ అని అన్నారు. ఎన్‌ఎంఆర్‌ఎసి కళాశాలలోని మౌలిక సదుపాయాలు, పరిశోధనాత్మక విద్యను అభినం దించారు.

ముగింపు సమావేశంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ దివ్య నల్ల మాట్లాడుతూ విద్యార్థులు సమాజం ఎదుర్కోంటున్న సమస్యలను పరిశోధనలు, సాంకేతిక నైపుణ్యతలతో పరిష్కారం కనుగొనే విధంగా ప్రోత్సహం అందిస్తున్నామని తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 సాధించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎన్.వి. రమేష్, వివిధ కళాశాలు, యూనివర్సిటీల ప్రతినిధులు, ఆధ్యాపకులు పాల్గొన్నారు.