ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి
08-07-2026 05:02 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మార్వో మురళి పరిశీలించారు. నమోదు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజలకు సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ దినేష్, జీపీఓ భారత్, గ్రామ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు రాకేష్, ప్రభుదాస్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.






