5 March, 2026 | 7:57 AM

నిర్మల్ మున్సిపాలిటీలో పర్యాటక అభివృద్ధి

05-03-2026 01:22 AM

జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు

నిర్మల్, మార్చి 4 (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం నిర్మల్ మున్సిపల్ అభివృద్ధి పర్యాటకంగా చేపట్టవలసిన చర్యలపై నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి దంపతులు జిల్లా ఇన్చార్జి మంత్రిని కలిశారు. చైర్ పర్సన్ దంపతులతో పాటు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాచారి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరిరావు మంత్రిని కలిశారు.

వారికి మంత్రి శాలువాతోసన్మానం చేశారు. నిర్మల్ పట్టణంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని మంత్రి చైర్‌పర్సన్ దంపతులకు సూచించారు. నిర్మల్ మున్సిపాలిటీలో విజయం సాధించిన సందర్భంగా ప్రత్యేక అభినందించారు. నిర్మల్  అభివృద్ధి తోపాటు పట్టణంలోని చారిత్రకమైన శ్యామఘడ్,  బత్తిస్‌ఘడ్‌లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని విన్నవించారు.  అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టు చైర్మెన్ అప్పాలకావ్య గణేష్‌చక్రవర్తిలు పేర్కొన్నారు.