2 July, 2026 | 12:11 PM

Breaking News

స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •  

తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యం

21-04-2026 12:19 AM

అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే జీఎంఆర్ 

పటాన్చెరు, ఏప్రిల్ 20 : ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన తాగునీరు సరఫరా, నిరంతర విద్యుత్ పంపిణీ, పారిశుధ్యం అంశంలో అలసత్వం వహించవద్దని.. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు.

సోమవారం క్యాంపు కార్యాలయంలో అమీన్పూర్, పటాన్చెరు బల్దియా డిప్యూటీ కమిషనర్లు, ఆయా మండలాల తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు, విద్యుత్, నీటిపారుదల, పిసిబి, జాతీయ రహదారులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, జలమండలి, పరిశ్రమలు, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులతో వివిధ అంశాలపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, నిర్దేశించిన సమయంలో తాగునీరు పంపిణీ చేయాలని సూచించారు. లో వోల్టేజి సమస్యలు తలెత్తకుండా విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐదు మున్సిపాలిటీలకు మంజూరైన 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు అతి త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు.

జిహెచ్‌ఎంసి పరిధిలోని 9 డివిజన్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వంతో చర్చించి మరిన్ని నిధులు కేటాయించబోతున్నట్లు తెలిపారు. అమీన్పూర్ పరిధిలో 23 కోట్ల రూపాయలతో 55 పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. నూతన కాలనీలకు సైతం మంచినీటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని జలమండలి జిఎం శ్రీనివాస్ కు సూచించారు.

నూతన పైపులైన్ల ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని ఇప్పటికే జలమండలి ఎండి అశోక్ రెడ్డికి సైతం  విన్నవించడం జరిగిందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినీటి పంపిణీ అంశంలో జాప్యం జరగకూడదని ఆదేశించారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 993 సర్వే నెంబర్ లో నవోదయ పాఠశాల ఏర్పాటు కోసం భూమి కేటాయింపు జరిగిందని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఇదే సర్వే నంబర్ లో ఎస్టిపి కోసం కేటాయించిన 10 ఎకరాల భూమిని ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా రద్దు చేయాలని కలెక్టర్ ని కోరనున్నట్లు తెలిపారు.