2 July, 2026 | 2:59 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

మహిళా, సంక్షేమానికి పెద్దపీట

21-03-2026 02:01 AM
  1. రూ.3,143 కోట్లు కేటాయింపు  
  2. డ్వాక్రా సంఘాలకు రూ.2,500 కోట్ల వడ్డీలేని రుణాలు 

హైదరాబాద్, మార్చి 20(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి బడ్జెట్‌లో గతేడాది కంటే ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు పెంచింది. 2026-27 బడ్జెడ్‌లో మహిళా, శిశు సంక్షేమానికి రూ.3,143 కోట్లు కేటాయించింది. వీటిలో రూ.1248 కోట్లు నిర్వహణ కోసం, రూ.1,896 కోట్ల పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

ఇక గత ఏడాది రూ.2,862 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్‌లో అదనంగా రూ.281 కోట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,781 అంగన్‌వాడీ కేంద్రాలలో సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు ఏడాదికి రెండు జతల యూనిఫామ్ ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు.. తెలంగాణ అడపడు చులకు డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.2,500 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది.

డ్వాక్రా సంఘాల మహిళలను ప్రోత్సహించడానికి కొత్తగా 18 ఏళ్లు పైబడిన మహిళలతో సంఘాలను ఏర్పాటు చే యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వ్యవసాయ అనుబంధ, పరిశ్రమ అనుబంధ రంగాల తో జీవనోపాధి పొందేందుకు రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణా లు అందజేయనున్నారు.