11-02-2026 12:06:48 AM
ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు
పకడ్బందీ ఏర్పాట్లు, 13న కౌంటింగ్
కరీంనగర్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికలకు ఉమ్మడి క రీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అ న్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటల నుండి సాయం త్రం 5 గంటల వరకు ఉంటుంది. 13న కౌం టింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల యంత్రాంగాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.
బుధవారం కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా స త్పతి ఎస్సారార్ కళాశాలలో ఏర్పాటు చేసిన కరీంనగర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్ నగరపాలక సంస్థలో మొత్తం 66 డి విజన్లు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 3,40, 580 కాగా మహిళా ఓటర్లు 1,70,858, పు రుష ఓటర్లు 1,69,679, ఇతరులు 43 మం ది ఉన్నారు. మొత్తం 477 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 14, మోడల్ పోలింగ్ స్టేషన్లను 5గా గుర్తించారు. 66 డివిజన్లలో 389 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల 13న ఎ స్సారార్ కళాశాలలో నిర్వహిస్తారు. చొప్పదండిలో 14 వార్డులు ఉండగా 13,916 మం ది ఓటర్లు, హుజూరాబాద్లో 30 వార్డులు 29,531 మంది ఓటర్లు ఉన్నారు.
జమ్మికుంటలో 30 వార్డులు 34,455 మంది ఓటర్లు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39 వార్డులు ఉండగా 117 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులు ఉండగా 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 81,959 మంది ఓటర్లు ఉం డగా పురుషులు 39,942, మహిళలు 42, 011, ఇతరులు ఆరుగురు ఉన్నారు.
వేములవాడ మున్సిపల్ పరిధిలో 40,877 మంది ఓటర్లు ఉండగా 19,580 మంది పురుషులు, 21,979 మహిళా ఓటర్లు, 18 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఎన్నికలకు పకడ్బందీగా ని ర్వహించేందుకు సిరిసిల్ల పరిధిలో 15 మం ది, వేములవాడ పరిధిలో 12 నుంది రిటర్నింగ్ అధికారులను ఏర్పాటు చేశారు. పో లింగ్ ఏర్పాట్లను సిరిసిల్ల అదనపు కలెక్టర్ గ డ్డం నరేష్ పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా రా మగుండు కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉం డగా 1,83,049 ఓట్లు ఉన్నాయి. పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 43 ,845 ఓట్లు ఉన్నాయి.
సుల్తానాబాద్లో 15 వార్డులు 16,824 ఓటర్లు, మంథనిలో 13 వార్డులు 14,402 మంది ఓటర్లు ఉన్నారు. జగిత్యాల జిల్లా జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులు ఉండగా 94,800 ఓటర్లు ఉం డగా, ధర్మపురిలో 15 వార్డులు ఉండగా 13, 988 మంది, కోరుట్లలో 33 వార్డులు ఉం డగా 63,502 మంది, మెట్పల్లిలో 26 వా ర్డులు ఉండగా 46,201 ఓటర్లు, , రాయికల్లో 12 వార్డులు ఉండగా 13,084 ఓటర్లు ఉన్నారు.
త్రిముఖ పోరు...
ఉమ్మడి జిల్లాలో గతంలోకంటే ఈసారి ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగి సో మవారంతో ముగిసింది. మంగళవారం పో ల్ చిట్టీల పంపిణీతోపాటు పోటాపోటీగా అ భ్యర్థులు డబ్బులు పంపిణీ చేశారు. అన్ని బ ల్దియా స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశాలు కనిపించ డం లేదు.
అయితే బీజేపీ గాలి వీసిందని చె ప్పవచ్చు. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ గాలి, సి రిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలో బీఆర్‌ఎస్ గాలి వీసింది. మిగితా చోట్ల నువ్వా నేనా అన్నట్లు పోరు నెలకొంది. ఓటరు నాడి పసిగట్టకుం డా ఉండడంతో ఎవరి అంచనాల్లో వారు ఉ న్నారు. పోలింగ్ అనంతరం ఓటరు నాడి బహిర్గతమయ్యే అవకాశం ఉంది.