16 May, 2026 | 4:12 PM

Breaking News

నిర్మల్ అభివృద్ధి ద్రోహి ఎమ్మెల్యే   •   సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   గ్రామీణ ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఏఐ టూల్స్   •   పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయి సభ్యులకు రివార్డులను అందజేత   •   తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు నకు కమిటీ ఏర్పాటు పట్ల హర్షం   •   లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం నూతన సెక్రటరీ గా పగడాల నరేష్   •   వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్‌డీఏ ఏపీడీ విజయ లక్ష్మీ   •   మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ కొండంత అండ   •  

మెడనొప్పి తగ్గాలంటే!

11-05-2025 12:00 AM

మెడ, చెవి మధ్యలో ఫోన్ పెట్టి మాట్లాడేవారు కొందరు. గంటల తరబడి కంప్యూటర్, ల్యాప్‌టాప్ చూసేవారు మరికొందరు. ఇలా మనం రోజూ చేసే పనులన్నీ మెడ మీద పెద్ద భారాన్నే మోపుతాయి. నొప్పికి దారితీస్తుంటాయి. నిజానికి మెడ నొప్పి ఉన్నట్టుండి తలెత్తేది కాదు. కండరాల బలం తగ్గటం, ఒత్తిడి, నిద్రలేమి వంటివి దీన్ని పెంచుతాయి. కాబట్టి మెడ నొప్పిని తేలికగా తీసుకోవడానికి లేదు. కొన్ని జాగ్రత్తలతో దీని నుంచి ఉపశమనం పొందవచ్చు. 

* ఒకసారి శరీర భంగిమ దెబ్బతింటే తిరిగి సరి చేయడం అంత తేలిక కాదు. కాబట్టి ఒకే భంగిమలో మరీ ఎక్కువసేపు లేకుండా చూసుకోవాలి. గంటల కొద్దీ కూర్చో కుండా అప్పుడప్పుడూ లేచి, నాలుగడుగులు వేయాలి.

* కుర్చీలు, టేబుళ్ల వంటి వాటినీ మెడకు అనుగుణంగా మార్చుకోవాలి. కంప్యూటర్ మానిటర్ పైభాగం కళ్లకు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. ఫోన్‌లో హ్యాండ్స్ ఫ్రీ ఫీచర్‌ను వాడుకోవాలి. హెడ్‌సెట్ ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. ట్యాబ్లెట్‌ను ఒడిలో కన్నా దిండు మీద పెట్టుకుంటే 45 డిగ్రీల కోణంలో ఉంచుకోవాలి. 

* కళ్లద్దాలు వాడేవారు ఎప్పటికప్పుడు దృష్టి దోషానికి తగినట్టుగా సరి చేసుకోవాలి. లేకపోతే స్పష్టంగా కనిపించటానికి తలను వెనక్కి వంచి చూడాల్సి వస్తుంది.

* పడుకున్నప్పుడు దిండు మరీ ఎత్తుగా ఉంటే మెడ కదిలే విస్తృతి దెబ్బతింటుంది. అందువల్ల దిండు మెడకు సమానంగా ఉండేలా చూసుకోవాలి. 

* నిద్ర సమస్యలు కండరాలు, ఎముకల నొప్పి వంటి రకరకాల జబ్బులకు దారితీస్తాయి. అందువల్ల కంటి నిండా నిద్రపోయేలా జాగ్రత్త పడాలి.