గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
రాజాపూర్‌లో ఘటన.. క్రైమ్‌సీన్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి.జానకి,
రాజాపూర్: మండలం రంగారెడ్డిగూడ గ్రామ సమీపంలోని ఎస్.పీ. పెట్రోల్ పంపు వద్ద NH-44 రహదారి పక్కన సుమారు 35–40 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. సమాచారం అందుకున్న మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి సంఘటనా స్థలానికి చేరుకుని క్రైమ్‌సీన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహం లభ్యమైన పరిస్థితులు, అక్కడ ఉన్న ఆధారాలు, పరిసర ప్రాంతాలపై పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి, మృతురాలి గుర్తింపును త్వరితగతిన నిర్ధారించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను శాస్త్రీయంగా సేకరించి, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు.






