18 July, 2026 | 5:53 PM

Breaking News

మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •   ప్రజలు పరిశుభ్రంగా ఉండాలంటే వ్యర్థ పదార్థాలు వేరు చేయాలి   •   గోదావరి పుష్కరాల నాటికి ఆలయ నిర్మాణం పూర్తి   •   ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన చిలుక సతీష్   •   ఘనంగా జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •  

అదుపు తప్పిన లారీ... ముగ్గురికి స్వల్ప గాయాలు

10-02-2026 04:49 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ పట్టణంలోని చర్చ్ గేట్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం లారీ స్వీయ ప్రమాదానికి గురైంది. మదురై నుంచి మధ్యప్రదేశ్‌కు కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రాజిని, క్లీనర్ దేవరాజ్‌కు స్వల్ప గాయాలు కాగా, లారీలో ఉన్న విఘ్నేష్‌కు కూడా తేలికపాటి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పెద్ద ప్రమాదం తప్పినందుకు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.