మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
16-04-2026 04:30 PM
నిర్మల్ ఏప్రిల్ 16 ( విజయ క్రాంతి): మొక్కజొన్న రైతులకు మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయిస్తుందని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ భీమ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ మార్కెట్ కమిటీ పరిధిలో లక్ష్మణ చందా, సో న్ , నర్సాపూర్ జి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు వెంటనే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. మొక్కజొన్న పండించిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో పంట పంట విక్రయించుకుని మద్దతు ధర పొందాలని తెలిపారు






