29 June, 2026 | 4:26 PM

విద్యాశాఖ నిర్లక్ష్యంపై కలెక్టరేట్ ముందు నిరసన

29-06-2026 03:50 PM

బీసీ సంక్షేమ సంఘం   

ముకరంపుర , జూన్ 29(విజయక్రాంతి):   జిల్లాలోని విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంపై బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కళ్ళకు గంతలు , ప్ల కార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు దొగ్గలి శ్రీధర్ , మాదాసు సంజీవ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ చేస్తున్న సంబంధిత విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దీనిపై విద్యాశాఖ అధికారులకు పలుసార్లు వివిధ సంఘాలు ఫిర్యాదు చేసినప్పటికీ విద్యాశాఖ అధికారుల తీరు మారలేదని అని మండిపడ్డారు.

అదేవిధంగా విద్యాశాఖ అధికారులు విద్యాసంస్థల ఆర్దిక దోపిడిని పరోక్షంగా సహకరించే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్  స్పందించాలని పేద విద్యార్థులకు 25% ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు.బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు జులై 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు , కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు వాయిల రాజ్ కుమార్ ,  తదితరులు పాల్గొన్నారు