29 June, 2026 | 4:41 PM

గిరిజన హక్కులు పరిరక్షణకై న్యాయం చేయాలి

29-06-2026 03:47 PM

ప్రజా ప్రభుత్వంలో న్యాయం చేస్తారని విన్నపం

 లంబాడి హక్కుల రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు రాజేష్ నాయక్ 

చుంచుపల్లి,(విజయక్రాంతి): గిరిజన హక్కులు పరిరక్షణకై న్యాయం చేయాలి. ప్రజా ప్రభుత్వంలో న్యాయం చేస్తారని లంబాడి హక్కుల పోరాట సమితి బృందం సోమవారం సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిగువ అంశాలను అమలు చేయాలని కోరారు 

తండాల గ్రామపంచాయతీలను - రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి, తండాల అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలి.

ఎస్టీ లు సాగు చేస్తున్న లావణి, సీలింగ్, పోడు భూములకు శాశ్వతంగా పూర్తి హక్కులతో అసెంబ్లీలో చట్టం చేసి పట్టాలు ఇవ్వాలి.

రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో 100 శాతం రిజర్వేషన్ ఎస్టీ లకు రాష్టంలో అమలు చేయాలి.

కేంద్ర ప్రభుత్వం అమలు చేయవలసిన అంశాలు:-

• ఎస్టీ ల రిజర్వేషన్ను, కేంద్ర ప్రభుత్వం 7.5% శాతంను పెరిగిన జనాభా ఆధారంగా 14% శాతానికి పెంచాలి.

• ఎస్టీ లంబాడీ గోర్బోలి భాషను అధికారికంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం 8వ షెడ్యూల్లో చేర్చాలి.

• ఎస్టీ ల 10% రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలి.

• దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలను ఎస్టి జాబితాలో చేర్చాలి. 

• పై అంశాలపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై వొత్తిడి చేసి, పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడి పరిష్కార దిశగా కాంగ్రెస్ హైకమాండ్ కృషి చేయాలని కోరుతున్నాం. సీఎంను కలిసిన వారిలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్ , కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవిందు నాయక్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ సూర్య నాయక్ తదితరులు ఉన్నారు.