29 June, 2026 | 5:31 PM

ఖమ్మం హనుమకొండ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలి

29-06-2026 04:36 PM

తుంగతుర్తి సర్పంచ్ మల్లపాక సాయిబాబ

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం నుండి గతంలో నడిచినటువంటి ఖమ్మం హనుమకొండ బస్సులను పునరుద్ధరించి ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించాలని తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబు సూర్యపేట డిపో మేనేజర్ సునీత  కోరారు. నియోజకవర్గ కేంద్రం నుండి వైద్య సేవల కోసం ఎక్కువగా ఖమ్మం, వరంగల్, హనుమకొండ వెళ్తుంటారు కాబట్టి ఈ రెండు బస్సులను పునరుద్ధరించాలని ఆయన కోరారు. డిపో మేనేజర్ కు వినతి పత్రం అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.