27 August, 2026 | 6:14 PM

నేపాల్ వరదల్లో 300 మందికిపైగా భారతీయులు గల్లంతు

27-08-2026 04:02 PM

ఖాట్మండు: నేపాల్-టిబెట్ సరిహద్దులోని(Nepal-Tibet border) కొన్ని ప్రాంతాలలో సంభవించిన ఆకస్మిక వరదల(Nepal floods) కారణంగా వేలాది మంది గల్లంతయ్యారని, వారిలో దాదాపు 300 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారని విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ గురువారం తెలిపారు. బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్‌లోని మూడు జిల్లాల్లో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. వరదల్లో గల్లంతైన వేలాది మందిలో దాదాపు 300 మంది భారతీయులు ఉన్నారని నేపాల్ విదేశాంగ మంత్రి ఖనాల్ గురువారం తెలిపారు.

వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ గురువారం నాడు సైనిక రవాణా విమానం ద్వారా రెండో విడత సహాయక సామగ్రిని పంపింది. అంతకుముందు బుధవారం నాడు, పొరుగు దేశమైన నేపాల్‌కు న్యూఢిల్లీ 10 టన్నుల మానవతా సహాయం మరియు విపత్తు సహాయక సామగ్రిని (HADR) పంపింది. నేపాల్ కోసం 37.5 టన్నుల మానవతా సహాయం, విపత్తు సహాయక సామగ్రి (HADR), మందులు, ఆహార పొట్లాలతో కూడిన రెండవ విమానం బయలుదేరిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. "నేపాల్ అధికారులతో భారత్ నిరంతరం సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకు మేము గట్టి మద్దతును కొనసాగిస్తాము," అని జైశంకర్ పేర్కొన్నారు.

https://www.youtube.com/embed/qvEQNx6zc1w