గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్ట్
మంథని ఎస్ఐ డేగ రమేష్ రమేష్
మంథని,(విజయక్రాంతి): మంథనిలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్ట్ చేసినట్టు మంతిని ఎస్ఐ డేగ రమేష్ తెలిపారు. మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గడుదలగండి ప్రాంతంలో మంగళవారం మంథని పోలీసులు నిర్వహించిన తనిఖీలలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిని చాకచక్రంగా పట్టుకున్నామని ఎస్ఐ తెలిపారు.
తన సిబ్బందితో శివకుమార్, ఆదేశ్ లతో కలిసి నిర్వహించిన తనిఖీలలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 120 గ్రాముల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, చందు సంతోష్, (గోపాలపూర్), కోల శ్రావణ్, అల్లెం అరుణ్, చింతకాని, కాటారం మండలం చెందిన వారిని అరెస్టు చేశామని, ఈ కేసుకు సంబంధించిన పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఎస్ఐ తెలిపారు.




