17 March, 2026 | 5:36 PM

నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు

17-03-2026 03:48 PM

హైదరాబాద్: కేంద్ర సాహిత్య అకాడమీ(Sahitya Akademi Award) పురస్కార గ్రహీత నందిని సిధారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. నందిని సిధారెడ్డికి పురస్కారం రావడం హర్షణీయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా సంక్షోభాలను  “అనిమేష” ద్వారా తెలియజేసిన మానవతావాది సిధారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో సిధారెడ్డి(Nandini Siddareddy) అక్షరాలను ఆయుధాలుగా మలిచారని గుర్తుచేసుకున్నారు. సిధారెడ్డి అక్షరాలను ఆయుధాలుగా మలిచి ఉద్యమస్ఫూర్తిని వ్యాప్తి చేశారని సూచించారు.

''ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య వికాస కృషీవలుడు శ్రీ నందిని సిధారెడ్డి గారు రచించిన కవితా సంపుటి “అనిమేష” కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకం. ఈ సందర్భంగా సిధారెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్ లో ఆయన మరిన్ని సాహితీ శిఖరాలను అధిరోహించి, తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షిస్తున్నాను.'' అంటూ సీఎం ఎక్స్ లో పోస్టు చేశారు.