28 June, 2026 | 12:54 PM

పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్లపై వేధింపులు ఆపాలి: పీవైఎల్

28-06-2026 12:24 PM

ఇల్లందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్లపై ఎస్సీ డీడీ శ్రీలత కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వెంటనే వాటిని నిలిపివేయాలని, లేకుంటే ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని పీవైఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు వి. మోతిలాల్ హెచ్చరించారు. ఇల్లందులో పీవైఎల్ జిల్లా నాయకుడు జోగా కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 16 నెలలుగా వేతనాలు చెల్లించకుండా,

గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వర్కర్లపై నోటీసులు లేకుండానే తొలగింపులు, నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు, విధుల మార్పులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పదేళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వర్కర్లకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో కోడెం రవి, తాటి రమేష్, సాధనపల్లి రవి, అటికం లాజర్, శేఖర్, కమాటం మాధవ్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.