19వ డివిజన్లో పల్స్ పోలియో
28-06-2026 12:27 PM
ముకరంపుర,(విజయక్రాంతి): పల్స్ పోలియో కార్యక్రమం సందర్బంగా ఐదేళ్ల లోపు వయస్సున్న ప్రతి చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ వేసి ప్రారంభించిన కరీంనగర్లోని 19వ డివిజన్ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణ గౌడ్ ప్రాణరక్షక పోలియో చుక్కలు 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వేయించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో షేక్ ఖాన్ నగర్ పాఠశాలలో గల కేంద్రానికి వెళ్లి తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ వైద్యులు లావణ్య విజయ రాణి ఆశా వర్కర్లు నవ్య,అంజలి, కవిత పాల్గొన్నారు.






