28 June, 2026 | 1:53 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

జూలై 1 నుంచి సఫారీ సేవలు తాత్కాలికంగా నిలిపివేత

28-06-2026 12:57 PM

వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయంలో అటవీ అధికారుల నిర్ణయం

అచ్చంపేట,(విజయక్రాంతి): జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (NTCA) మార్గదర్శకాల మేరకు.. అడవి జంతువుల సంతానోత్పత్తి (Breeding Season) కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని అన్ని సఫారీ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీ డివిజనల్ అధికారి ఏ.రామమూర్తి తెలిపారు.

ఈ నిర్ణయంతో పులులు, ఇతర వన్యప్రాణులు ఎలాంటి అంతరాయం లేకుండా సహజ వాతావరణంలో సంచరించడానికి, సంతానోత్పత్తి, పిల్లల సంరక్షణను సురక్షితంగా కొనసాగించడానికి అవకాశం ఉంటుందన్నారు. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు తాత్కాలిక సఫరా సేవల నిలిపివేతకు సహకరించాలని కోరారు. సఫారీ సేవలు తిరిగి అక్టోబర్ 1 నుంచి పుణ: ప్రారంభమవుతాయని చెప్పారు.