పోలియో రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత
28-06-2026 12:20 PM
- కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. చిన్నారుల నిండు జీవితానికి రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఆదివారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా అధికారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.






