కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది: ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీలో(Bharatiya Janata Party) కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, సరైన అవకాశాలు లభిస్తాయని ఎంపీ మాధవనేని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఇటీవల సిద్దిపేట జిల్లా నూతన కమిటీని ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ఎంపీని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని రఘునందన్ రావు అభినందించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేవారే భవిష్యత్తులో నాయకులుగా ఎదుగుతారని ఎంపీ అన్నారు.
పార్టీ మరింత బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు విభీషణ్ రెడ్డి, ఖమ్మం వెంకటేశం, నత్తి మల్లేశం, ఉపాధ్యక్షులు తొడుపునూరి వెంకటేశం, సుభాష్ రెడ్డి, కొత్తపల్లి వేణుగోపాల్, బాల్ రెడ్డి, భాగ్యలక్ష్మి, కుమార్ గౌడ్, కార్యదర్శులు యాదమల్లు, బాబు, వెంకట్ గౌడ్, సురేష్, ఆఫీస్ సెక్రటరీ గుండ్ల జనార్ధన్, మీడియా కన్వీనర్ గోనె మార్కండేయులు, సోషల్ మీడియా ఇన్చార్జి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






