25 July, 2026 | 4:56 PM

ఎమ్మెల్యే అనుచరులపై చర్యలు తీసుకోవాలి

25-07-2026 03:55 PM

* బిజెపి నాయకుల డిమాండ్

ఉట్నూర్,(విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీపై  జన్నారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అనుచరులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై  వెంటనే చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఉట్నూర్ మండల కేంద్రంలోని  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  చౌక్ వద్ద  బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ఉట్నూర్ మండల మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఐబి చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ... ఖానాపూర్ శాసనసభ్యులు శ్రీ బొజ్జు పటేల్ వారి  అనుచరులు కలిసి జన్నారం లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని అనుచిత వ్యాఖ్యలతో సంబోధించడం వారికీ తగదన్నారు.అనుచిత వాక్యాలు చేసిన శాసనసభ్యులు శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ మరియు అనుచరులను వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.నిరసన అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మండల అధ్యక్షులు బింగి వెంకటేష్,జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్,టౌన్ అధ్యక్షులు తన్నీరు సతీష్, ఓబీసీ మోర్చా కన్వీనర్ సిపతి లింగగౌడ్,మాజి జడ్పీటీసీ సాదిగే గంగన్న మండల ప్రధాన కార్యదర్శి కాల్వ రవి సాలగారి రవీందర్ మధుకర్ శాడిగే రాజేశ్వర్ శ్రీకాంత్ కాటం రవీందర్ బాబు శేషారావు అర్జున్ రాహుల్ రమణ సత్యనారాయణ అరవింద్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.