రాజ్యాంగాన్ని తిరస్కరించేవారే దిమాగీ నక్సల్స్
ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి రిజిజు కౌంటర్
న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రతిపక్ష నాయకుల ను ‘దిమాగీ నక్సల్స్’ అని ప్రధాని నరేంద్ర మోదీ అనలేదని, రాజ్యాంగాన్ని తిరస్కరిస్తూ మావోయిస్టులకు మద్దతు ఇచ్చేవారిని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నవారిని ఉద్దేశించి అన్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం పెట్టిన పోస్ట్‌పై కేంద్రమంత్రి రిజిజు ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ ద్వారా విమర్శలు గుప్పించారు. ఆర్టికల్ 370ని సమర్థించేవారు, భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి ‘చికెన్ నెక్’ను వేరు చేయాలని చూసేవారు
మాత్రమే ‘దిమాగీ నక్సల్స్’ అని రిజిజు పేర్కొన్నారు. ఉపా కేసులో అరెస్టయిన శర్జీల్ ఇమామ్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.






