పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి తీవ్రగాయాలు
17-08-2026 12:21 PM
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం తుమ్మలచలక గ్రామంలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు గ్రామానికి చెందిన ఐదుగురిని కరిచింది. ఈ ఘటనలో చీమల నాగరాజు, ఊకే గోపాల్, ఊకే లలిత్, మోహస్ ఎరేం వెంకన్న, బొర్ర స్వామి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యాధికారి డాక్టర్ కంచర్ల వెంకటేష్ సూచన మేరకు ఐదుగురినీ కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్క సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కను పట్టుకుని గ్రామస్థులకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.






