10 June, 2026 | 6:25 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు బాట పడతా   •   మడే రాజేష్ కి 'గౌరవ డాక్టరేట్'   •   జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •  

యుఫోరియా కొత్త డేట్ ఇదే

02-12-2025 02:09 AM

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. ఈ సినిమాను గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు.

డిసెంబర్ 25న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. 2026, ఫిబ్రవరి 6న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడిస్తూ, టీజర్‌ను రిలీజ్ చేశారు. నేటి యూత్ డ్రగ్స్ మహమ్మారి వల్ల ఎలా పెడదారులు పడుతుందనే విషయాన్ని చూపిస్తూనే తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉండాలనే విషయాన్ని భూమిక పాత్రతో పరిచయం చేశారు. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కే పోతన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.