23 May, 2026 | 10:50 AM

చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ అరెస్ట్

23-05-2026 09:53 AM

 టౌన్ ఏసీపీ రమణమూర్తి 

ఖమ్మం,(విజయక్రాంతి): ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని నగరంలో చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితుడిని ఖమ్మం అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు.శనివారం ఖమ్మం ఖానాపురం హవెలి పోలీసుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ సర్కిల్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు నెంబర్ లేని పల్సర్ మోటార్ సైకిల్ పై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా  పోలీసులను చూసి  పారీపోతుండగా పోలీసులు పట్టుకొని విచారించినట్లు తెలిపారు. అతను గుంటూరు జిల్లా, నల్లపాడు గ్రామం, అంకిరెడ్డి పాలెం చెందిన అంతరరాష్ట్రా దొంగ అయిన పట్నాల వెంకట దుర్గ ప్రభు @ అఖిల్  29 సం,, జిమ్ ట్రైనర్ గా గుర్తించారు.

శుక్రవారం నగరంలోని శ్రీరాం నగర్ రోడ్డు నెం. 7లో ఒక మహిళ ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తుండగా  ఆమె మెడలో బంగారు చైన్ ను గమనించి ఎలాగైనా లాక్కొని దొంగతనం చేయాలని నిర్ణయించుకుని, తనని ఎవరు గుర్తు పట్టకుండా ముఖానికి ఖర్చిఫ్ కట్టుకుని, తన  మోటార్ సైకిల్ గుర్తు పట్టకుండా వుండేందుకు నెంబర్ లేకుండా, పల్సర్  అనే పేరు కనిపించకుండా అట్టి పేరుపై తెల్లటి స్టిక్కర్ అంటించి,ఆమె ప్రక్కనే తన మోటార్ సైకిల్ ను  ఆపి, ఒక్కసారిగా ఆమెను వద్దకు వెళ్ళి చంపుతానని గట్టిగా బెదిరించి ఆమె మెడలో వున్న చైన్ బలవంతంగా లాక్కొని పారిపోతూ...తన మోటార్ సైకిల్ ఎక్కే క్రమంలో తను లాక్కొన్న చేతిలోని బంగారు చైన్ జారీ క్రింద పడినది.

బాధితురాలు ఫిర్యాదుపై ఖానాపురం  పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తిరిగి శనివారం మరలా అదేవిధంగా ఒంటరి మహిళలను, వృద్ధులను లక్ష్యంగా  చేసుకొని నేరాలకు పాల్పడాలని  ఉద్దేశంతో   ఖమ్మం కు వస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని  బాపట్ల జిల్లా కర్లపాలెం, పల్నాడు జిల్లా నర్సరావు పేట, ఒంగోలు జిల్లా అద్దంకి, గుంటూరు జిల్లా పొన్నూరు ఒంటరిగా వెళ్తున్న మహిళల లను లక్ష్యం గా మెడలో నుండి గొలుసులు లాక్కొని పోగా, ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు తెలిపారు.

ఆ ప్రాంతాలలో నిందుతుడిని  చూస్తే గుర్తు పడతారని, తెలంగాణ రాష్ర్టం ఖమ్మం పట్టణంలో ఒంటరిగా వున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలలో గొలుసులు దొంగతనం చేద్దామని ఖమ్మం పట్టణం వస్తునట్లుగా నిందుతుడు తెలిపినాడని ఏసీపీ వివరించారు. ముఖ్యం గా తాను డబ్బులు లోన్ తీసుకున్న EMI లు కట్టడానికి, తన కుటుంబాన్ని పోషించడానికి, తన  విలాసవంతమైన జీవితానికి తనకు  వచ్చిన డబ్బు సరిపోక పోవడంతో నేను ఎలాగైనా సులబంగా డబ్బు సంపాదించాలని అనుకుని ఒంటరిగా వెళ్తున్న  మహిళల మెడలో నుండి గొలుసులు లాక్కెళ్లలాని నిర్ణయించుకుని నేరలకు పాల్పడినట్లు తెలిపారు.  ఒంటరి మహిళలలు,వృద్ధులు  ఇలాంటి నేరగాళ్ళ  పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ తెలిపారు.