25 April, 2026 | 5:28 PM

Breaking News

అదనపు కలెక్టర్‌ను కలిసిన తెలంగాణ ఎన్జీవోల సంఘం నాయకులు   •   గురుకులాల ప్రగతిలో గురువుల పాత్ర అమోఘం   •   బాల్య వివాహాలు అరికట్టడం అందరి బాధ్యత   •   దోమల నివారణతోనే మలేరియాకు అడ్డుకట్ట   •   శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఉత్సవాలకు హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి   •   కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •  

ప్రజలకు అందుబాటులో ఉండి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

19-12-2025 12:18 AM
  1. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి

సీపీఎం సర్పంచులకు సన్మానం 

నకిరేకల్, డిసెంబర్ 18 : ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగిస్తూ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి అన్నారు.రామన్నపేట మండలంలోని మునిపంపుల, దుబ్బాక గ్రామాల్లో సీపీఎం బలపరిచిన సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నర్సింహాను స్థానిక సీపీఎం కార్యాలయంలో సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాలు పెరిగిన పరిస్థితుల్లో, ప్రజలను మభ్యపెట్టకుండా పోరాటాలే పెట్టుబడిగా గెలుపొందడం అభినందనీయమని అన్నారు. ప్రజల సమస్యలను నిరంతరం అధ్యయనం చేసి పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు అందేలా చూడాలని, అర్హులైన వారికి ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేసి గ్రామాలను కమ్యూనిస్టు దృక్పథంతో ఆదర్శంగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాగిరు కిష్టయ్య, సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యుడు బోయని ఆనంద్, మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు, మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్ తదితరులు పాల్గొన్నారు