పాలనలో 100 రోజుల మార్క్
నిర్మల్ ఆగస్టు 7 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో బాధితులను చేపట్టిన జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా పరిపాలనలో తనదైన మార్కు సాధించారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ అధికారులతో సంబంధం ఎంతో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తూ రాష్ట్రస్థాయిలోని నిర్మల్ జిల్లా ఓ ప్రత్యేకతను చాటుకున్నారు.
జిల్లా కలెక్టర్ బాధ్యతలను స్వీకరించి వంద రోజులు పూర్తి చేసుకున్నారు. వందరోజుల పరిపాలనలో జిల్లాలో పారదర్శకంగా, మొక్కజొన్నలు రికార్డ్ స్థాయిలో కొనుగోలు చేసి రైతులకు చేయూతలించారు. వరి, జొన్న కొనుగోలు ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో విద్య వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతిరోజు పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో లోపాలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో ఎఫ్‌ఆర్సి ముఖ గుర్తింపుపై ప్రత్యేక దృష్టి 100% హాజరు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలను ఇప్పటికీ పర్యటించిన కలెక్టర్ ఆయా ప్రాంతాలపై అవగా హన పెంచుకొని అక్కడి ప్రజల జీవన స్థితిగతులు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టారు. పెంబి మండలంలోని మారుమూల గిరిజన ఆదివాసి గ్రామాలను మోటార్ సైకిల్ పై వెళ్లి అక్కడి సమస్యలను విన్న కలెక్టర్ వాటి పరిష్కారానికి ఒక్కొక్కటిగా చర్యలు చేపడుతున్నారు.
ఆదివాసిగూడలో ఇంటర్నెట్ రోడ్లు భవనాలు ప్రభుత్వ విద్య నిత్యవసర సరుకులు పంపిణీ ప్రజా ఆరో గ్యం వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారు. కేజీబీవీ ప్రభుత్వ పాఠశాలను గురుకుల పాఠ శాలలు అంగన్వాడీలు ఆకస్మికంగా తనిఖీ చేయడమే కాకుండా కిందిస్థాయి అధికారులను వారం వారం క్షేత్రస్థాయిలో రాత్రి వేళల్లో తనిఖీలు చేస్తే విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేస్తున్నారు.
ఎక్కడికి వెళ్లినా పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యాంశం బోధించి ప్రశ్నలు వేసి జవాబు చెప్పిన విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో సాదాభైనామాలు ప్రజావాణి సమస్యలను పరిష్కరించేందుకు నిర్దిష్ట గడువును పెట్టుకొని వారం వారం సమీక్ష చేస్తున్నారు. జిల్లాలో సమీక్ష సమావేశంలో నిర్దేశించిన సమయానికి చేరుకొని సమావేశాన్ని పూర్తిచేసి ప్రభుత్వ ప్రాధాన్యతను ప్రభుత్వ అధి కారులకు వివరిస్తూ అలసత్వం వహించిన అధికారులపై చర్యలకు కూడా ఉపక్రమిస్తున్నారు.
ప్రజల నుంచి వచ్చి ప్రతి ఫిర్యాదును స్వయంగా తన సెల్ఫోన్లో బంధించి వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు భరోసా అందిస్తున్నారు.ఉదయం సాయంత్రం వేళ ల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అధికార యం త్రాంగానికి అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో జలసిరి పథకానికి ప్రాధనతిస్తూ క్షేత్రస్థాయి లో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించి ఒకేరోజు 1100 గుంతలు కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో 14 గ్రామాల్లో డిజిటల్ సర్వే ముమ్మరంగా చేపడుతున్నారు. 100 రోజుల పాలల్లో కలెక్టర్ చేరువా అయ్యారన్న అభిప్రాయం ఇప్పుడు చర్చ జరుగుతోంది.






