ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారు
మాజీ మంత్రి బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి
జగిత్యాల, మే 20 ( విజయక్రాంతి ) :ఇం టిగ్రేటెడ్ స్కూల్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని బిఆర్‌ఎస్ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి ,మాజీ మంత్రి జీవన్రె డ్డి విమర్శించారు. బుధవారం జగిత్యాలలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వ హించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు అనంతరం మాజీ సీఎం కేసీఆర్ అంబేద్కర్ ఆశ యాలకు అనుగుణంగా పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్య లు తీసుకున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనకు ముందు కేవలం 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే ఉండేవని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వాటి సంఖ్యను 239 కు పెంచామని గుర్తుచేశారు.ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసి గ్రామీణ విద్యా ర్థులకు ఉన్నత అవకాశాలు కల్పించామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా పాఠశాలల కు శాశ్వత భవనాలు నిర్మించలేదని విమర్శించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్లపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని, విద్యార్థుల ప్రవేశాలు, ఉపాధ్యాయుల నియామక ప్రక్రియపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ల నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వం ఆ పనులను ఎవరికి అప్పగించబోతోందో చెప్పాలని ప్రశ్నించారు. రెసిడెన్షి యల్ పాఠశాలల కోసం ముందుగా స్థల సేకరణ చేసి, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించా రు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 20 ఎకరాలు అవసరమని అధికారులు, జిల్లా మంత్రి ప్రతిపా దించగా, ఇప్పుడు 10 ఎకరాలకు పరిమితం చేయడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు.20 ఎకరాల నుండి 10 ఎకరాలకు కు దించినందుకు పాలాభిషేకాలు చేశారా అంటూ ఎద్దేవా చేశారు.ప్రభుత్వం ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించా రు. ప్రస్తుతం కొనసాగుతున్న గురుకుల పా ఠశాలల వద్దే స్థలాలు సేకరించి శాశ్వత భవనాలు నిర్మించాలని కోరారు.
జగిత్యాల పట్ల ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించిన ఆయన, మంత్రి లక్ష్మణ్కు మార్ వెంటనే జోక్యం చేసుకుని ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 20 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.చల్గల్లో హార్టీకల్చర్ కళాశాల మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత,బిఆర్‌ఎస్ నాయకులు వెంకటేశ్వర్ రావు, శివాకేసరి బాబు, ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.






