10-02-2026 12:00:00 AM
తరుణ్ భాస్కర్ హీరోగా రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీవోవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంథిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేశ్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఇందులో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ కమ్ ట్రైలర్‌ను టీమ్ సోమవారం విడుదల చేసింది.
ఈ ట్రైజర్ ఈవెంట్‌లోనే ఈ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. “కొంతమందికి అమెరికా వెళ్లాలని లక్ష్యం ఉంటుంది. కానీ వీసాలు చాలాసార్లు రిజెక్ట్ అవుతుంటాయి. దానికి చాలా నవ్వుకునే కారణాలుంటాయి. ఇలాంటి అంశాలతో ఉన్న ఈ కథ చెప్పినప్పుడే విపరీతంగా ఎంజాయ్ చేశా. ఆ యూనిక్ ట్రీట్‌మెంట్‌కు ఫిదా అయిపోయా. ప్రేక్షకులు కూడా ఫిదా అవుతారని నమ్మకం ఉంది.
థియేటర్లో లాఫ్ రైడ్ ఉంటుంది” అన్నారు. ‘చాలా ఫన్నీగా ఉంటుంది.. చాలా అద్భుతమైన కథ ఇది’ అని ఫరియా అబ్దుల్లా తెలిపారు. డైరెక్టర్ కశ్యప్ మాట్లాడుతూ.. “ఫస్ట్ సినిమా తీయడం, ఇక్కడి వరకు రావడం ఒక సక్సెస్. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని చెప్పారు. ‘స్నేహితులందరం కలిసి చేశాం. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’ అని నిర్మాత విజయ్‌కృష్ణ తెలిపారు. మరో నిర్మాత భాను కిరణ్ మాట్లాడుతూ.. ‘ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్ ఉన్న సినిమా” అన్నారు.