calender_icon.png 10 February, 2026 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హై అందరికీ రావాలి

10-02-2026 12:00:00 AM

అనిల్ రావిపూడి అసోసియేట్, అతని పలు చిత్రాలకు సహ రచయితగా పనిచేసిన ఎస్ కృష్ణ ‘హై’ అనే ప్రాజెక్టుతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నటుడు, సహ నిర్మాతగానూ పనిచేస్తున్నారు. ఇమేజ్ స్పార్క్  ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ పతాకాలపై హరీశ్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనన్యశర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణకమల్, సాయికృష్ణ, రేవంత్ ప్రధాన తారాగణం. ఈ మూవీ టీజర్‌ను హీరో వెంకటేశ్ సోమవారం లాంచ్ చేశారు.

ఈ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నా సినిమాలకు పనిచేస్తూ గ్యాప్‌లో ఈ షూటింగ్ చేసేవాడు. ఒక కొత్త జానర్‌లో డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో తీసిన సినిమా ఇది. తన ప్రయత్నాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. హైదరాబాద్ లైవ్ లొకేషన్స్‌లో ఈ సినిమా తీశారు. ఈ సినిమాకి హై అనే టైటిల్ పెట్టారు. అలాంటి హై అందరికీ రావాలి” అన్నారు.

ఈ సినిమా యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎస్ కృష్ణ మాట్లాడుతూ.. “ఈ ప్రోడక్ట్ అందరికీ మంచి హై ఇస్తుందని నాకు గట్టి నమ్మకం. ఈ సినిమా చూస్తున్న ప్పుడు హైదరాబాదులో ఇన్ని రోడ్లు ఉన్నాయా అనుకుంటారు. క్రికెట్ ఆడే విధానం కూడా చాలా కొత్తగా ఉంటుంది” అని చెప్పారు. ‘ఆడియన్స్ థియేటర్స్‌లో కచ్చితంగా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది’ అని చిత్ర నిర్మాత హరీశ్ పెద్ది తెలిపారు. ఇంకా ఈ ఈవెంట్‌లో నిర్మాతలు దిల్ రాజు, సురేశ్‌బాబు, మూవీ యూనిట్ పాల్గొన్నారు.