2 June, 2026 | 3:47 AM

మణుగూరు ఏరియా ఉత్తమ ఉద్యోగులు వీరే

02-06-2026 12:57 AM

మణుగూరు, జూన్ 1,(విజయక్రాంతి): రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది సింగరేణి వ్యాప్తంగా ఏరియాల వారీగా ఉత్తమ ఉద్యోగులను సింగరేణి ప్రకటించింది. మణుగూరు  ఏరియాకు గాను స్పెషల్ అవార్డ్ (ఉత్తమ ఉద్యోగి)గా ఏరియా ఇంజనీర్ ఆర్. శ్రీనివాస్, ఉత్తమ ఉద్యోగులుగా గౌరారం నరసింహులు కన్వేయర్ ఆపరేటర్, కెసిహెచ్పి, ఎం. వెంకటరమణ డి వై ఎస్ ఈ (ఈ&ఎం) పి కెఓసిలను  ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేయడం జరిగిందని  ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

వీరిలో ప్రధమ ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన  ఆర్. శ్రీనివాస్ కు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం నందు జరుగు సెంట్రల్ ఫంక్షన్లో సంస్థ మేనేజింగ్ అండ్ డైరెక్టర్  డా. బుద్దప్రకాశ్ జ్యోతి చేతుల మీదుగా, సన్మానం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన గౌరారం నరసింహులు, స్పెషల్ అవార్డ్ పొందుచున్న  ఎం. వెంకట రమణ లను ఏరియా జిఎం కార్యాలయంలో జరిగే వేడుకలలో సన్మానించి ప్రశంసా పత్రాలను అందజే స్తామని జిఎం పేర్కొ న్నారు. వృత్తిలో నిబద్ధతతో నైపుణ్యత చూపుతూ అంకిత భావంతో పని చేసి ఏరియా ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారిని  జిఎం రామచందర్ ప్రత్యేకంగా అభినందించారు.