24 August, 2026 | 10:07 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

వలసలపై అధ్యయనం జరగాలి

22-06-2025 12:00 AM

ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా అక్కడ సాయం కోరుతూ భారతీయులు తమను రక్షించమని స్వదేశానికి తరలించమని మన దేశ విదేశాంగశాఖపై ఒత్తిడి చేయటం పెరుగుతోంది. అది -గాజా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, బంగ్లాదేశ్, చైనా, బ్యాంకాక్, మలేషియా, ఉక్రెయిన్, రష్యా, ఆఫ్రికా దేశాలు, గల్ఫ్ ఇలా మరే దేశమైనా కావచ్చు. అక్కడికి మన వాళ్ళు చదువుల నిమిత్తమో, ఉద్యోగ నిమిత్తమో వెళుతున్నారు.

వారిని  తిరిగి భారత్ తేవటానికి ప్రత్యేక విమానాలను సిద్ధం చేస్తున్నారు. భారతదేశం సువిశాల దేశం. ఎన్నో వనరులకు నిలయం. మానవ వనరులకూ కొదవ లే దు. అయినా, వలసలు మన దేశం నుంచి ప్రపంచంలోని అతిచిన్న వెనుకబడిన దేశానికి సైతం జరుగుతున్నాయి. వారంతా ఎందుకి లా వలసలు వెళుతున్నారో ఇప్పటికైనా ఒక అధ్యయనం జరగాలి. 

 కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రబాద్