ప్రతీ హీరో నుంచి వరుస సినిమాలు రావాలి
టాలీవుడ్ రా కింగ్ మనోజ్ మంచు తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే.. “ప్రతీ హీరో నుంచి కంటిన్యూగా సినిమాలు రావాలని కోరుకుంటున్నా. నేను కూడా వరుసపెట్టి చిత్రాలు చేయాలనే ప్లానింగ్‌లోనే ఉన్నాను. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా. ఇప్పుడు నా చేతిలో ఐదారు ప్రాజెక్టులున్నాయి. వాటికి సంబంధించిన అనౌన్స్‌మెంట్లు ఈ నెలలోనే వస్తాయి.
జూన్ 7న నా కొత్త సినిమా ‘రక్షక్’ ప్రారంభం కాబోతోంది. అందులో నేను డీసీపీగా పాత్రను పోషిస్తున్నా. ‘డేవిడ్ రెడ్డి’ షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయింది. మే 20 సాయంత్రం గ్లింప్స్ రాబోతోంది. అన్ని రకాల పాత్రల్ని చేయాలనుకుంటున్నా. మౌనిక ‘నమస్తే వరల్డ్’ టాయ్స్ గురించి పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తారు. ‘ఐక్య ధైర్య సేనా సమితి’ ట్రస్ట్ మాకు ఓ బిడ్డ లాంటిదే. ‘ఐక్య’కి ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. దీనికి సంబంధించి నియమాల్ని ఇంకా రూపొందించ లేదు.. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాం. కావాల్సిన నిధి కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం” అని తెలిపారు.






