8 June, 2026 | 2:57 AM

ఆటిజంపై అవగాహన అవసరం

08-06-2026 12:21 AM
  1. చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలి 
  2. లయన్ డాక్టర్ కిరణ్
  3. ఆటిజం మిషన్‌కు అండగా ఉంటా 
  4. సినీ నటుడు మురళీమోహన్

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి) : ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్‌డీ) పై అవగాహన, ఆమోదం, సమ్మిళితత్వాన్ని పెంపొం దించే లక్ష్యంతో డాక్టర్ కిరణ్ ఆటిజం మిషన్ ఆధ్వర్యంలో ఆటిజం అండ్ బియాండ్ నావిగేటింగ్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ పాసిబిలిటీస్ పేరు తో రాష్ట్ర స్థాయి సదస్సు ఆదివారం గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ గ్లోబల్ పీస్ ఆడిటో రియంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సదస్సులో వెయ్యికి పైగా తల్లిదండ్రులు, ఉపా ధ్యాయులు, థెరపిస్టులు, వైద్య నిపుణులు, ప్రత్యేక విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, సా మాజిక సంస్థల ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు పాల్గొని ఆటిజం బాధితులకు అవసరమైన సహాయక వ్యవస్థలు, చికిత్సా విధానాలు, సమ్మిళిత అవకాశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, నిర్మాత, మాజీ పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్, నటుడు, నిర్మాత రాజా రవీంద్ర, ఎన్‌ఐఈపీఐడీ సికిందరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వి. శ్రావణ్ రెడ్డి, ప్రముఖ గైనకాల జిస్ట్ డాక్టర్ శిల్పి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ ఆటిజం బాధితులకు ప్రభుత్వ స్థాయిలో మ రిన్ని విధానపరమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కూడా సేవలు అందుబాటులోకి రా వాలంటే ప్రతి మండలంలో చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూ చించారు.ఆటిజం అన్ని వర్గాల ప్రజల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఆటిజం పై మరింత అవగాహన పెరగాలి అని ఆ యన అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మురళీమోహన్, డాక్టర్ కిరణ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. డా క్టర్ కిరణ్ ఆటిజం మిషన్ కార్యక్రమాలకు తాను కూడా తన వంతు సహకారం అందిస్తానని మురళీమోహన్ ప్రకటించారు. సద స్సులో మాట్లాడిన డాక్టర్ వి. శ్రావణ్ రెడ్డి, ఆటిజం అనేది వ్యాధి కాదని, అది ఒక న్యూ రో డెవలప్‌మెంటల్ పరిస్థితి అని తెలిపారు.

దీనిపై సరైన అవగాహన, సమయానుకూల గుర్తింపు, శాస్త్రీయ ఆధారాలతో కూడిన జోక్యం అవసరమన్నారు.సదస్సులో ప్రము ఖ వైద్యులు, సైకాలజిస్టులు, థెరపిస్టులు, ప్రత్యేక విద్యావేత్తలు పాల్గొని ఆటిజం చికి త్స, ప్రారంభ దశ జోక్యాలు, విద్యా అవకాశాలు, తల్లిదండ్రుల పాత్ర తదితర అంశా లపై విలువైన సమాచారాన్ని అందించారు. తల్లిదండ్రులు నిపుణులతో నేరుగా మమేకమై తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పించారు.