జీసీసీల అడ్డా హైదరాబాద్
- పెరుగుతున్న గ్రేటర్ వాటా
- గత రెండేళ్లలో 12నుంచి 14 శాతానికి..
- కలిసొస్తున్న ప్రభుత్వ విధానాలు, మౌలిక వసతులు, మానవ వనరులు
- భారత జీసీసీ వ్యవస్థలో తగ్గుతున్న బెంగళూరు వాటా
- అక్కడ సవాళ్లు విసురుతోన్న సమస్యలు
- హైదరాబాద్ వైపు కంపెనీల మొగ్గు
హైదరాబాద్, జూన్ 7(విజయక్రాంతి): గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతోంది. తక్కువ నిర్వహణ వ్యయం, మెరు గైన వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, విశాలమైన భూముల లభ్యత, ప్రభుత్వ అనుకూల విధానాలు.. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలను ఆకర్షిస్తు న్నాయి.
జీసీసీలు, టాలెంట్ ఎకోసిస్టమ్, ఆవిష్కరణల పరంగా చూస్తే దేశంలోని ప్రథమశ్రేణి నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. కానీ, కొంతకాలంగా పరిస్థి తి మారుతోంది. భారత జీసీసీ వ్యవస్థలో బెంగళూరు వాటా 2020లో 35 శాతం కాగా, ఈ ఆర్థిక సంవత్సరం 26 శాతానికి పరిమితమైంది. హైదరాబాద్ తన వాటా ను 12 నుంచి 14 శాతం పెంచుకుంది.

దేశవ్యాప్తంగా 2,500కు పైగా..
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ప్రస్తుతం బహుళజాతి సంస్థల వ్యూహాత్మక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయి. ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్, ప్రొడక్ట్ ఇంజినీరింగ్ వంటి కీలక విభాగాలను భారత్‌లోని జీసీసీల నుంచే నిర్వహిస్తున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,500కు పైగా జీసీసీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వాటిలో 20 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వచ్చే నాలుగైదేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని పరిశ్రమల వర్గాల అంచనా వేస్తున్నాయి.
బెంగళూరుకు సమస్యల సవాళ్లు..
భారత్‌లో జీసీసీలకు బెంగళూరు ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది. ఇక్క డ 850కి పైగా జీసీసీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, వాల్‌మార్ట్, గోల్డ్‌మన్ సాక్స్, ఇంటెల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు తమ కీలక కార్యకలాపాలను బెంగళూరు నుంచే నిర్వహి స్తున్నాయి. అనుభవజ్ఞులైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, పరిశోధన నిపుణులు, సీనియర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది ఎక్కువగా ఉండటం బెంగళూరుకు ప్రధాన బలం. దేశంలో అత్యంత బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్ కూడా అక్కడే ఉండటంతో కొత్త టెక్నాలజీలు, ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తోంది.
అయితే బెంగళూరు కొంతకాలంగా సమస్యలను ఎదుర్కొంటోంది. ట్రాఫిక్ రద్దీ, పెరు గుతున్న కార్యాలయ అద్దెలు, అధిక జీవన వ్యయం కంపెనీలకు తలనొప్పిగా మారుతున్నాయి. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్, వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రధాన ఐటీ కారిడార్లలో అద్దెలు గణనీయంగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ రంగ నిపుణుల అంచనా ప్రకారం హైదరాబాద్‌తో పోలిస్తే బెంగళూరులో కార్యాలయ నిర్వహణ ఖర్చు లు, అద్దెలు, ఉద్యోగుల వ్యయాలు కలిపి సగటున 30 నుంచి 40 శాతం వరకు అధి కంగా ఉన్నాయి.
ట్రాఫిక్ సమస్యల కారణంగా ఉద్యోగుల ఉత్పాదకతపై కూడా ప్ర భావం పడుతోందని పలు కార్పొరేట్ సంస్థలు పేర్కొంటున్నాయి. రోజూ గంటల తరబడి సమయం ప్రయాణంలోనే వృథా అవుతుండటంతో ప్రత్యామ్నాయ నగరాలపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.
హైదరాబాద్‌కు పెరుగుతున్న డిమాండ్..
హైదరాబాద్ అంతర్జాతీయ సంస్థలకు ఆకర్షణీయ కేంద్రంగా మారింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నానక్‌రామ్‌గూడ ప్రాంతాలు జీసీసీల కు ప్రధాన కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. అమెజాన్, ఒరాకిల్, జేపీ మోర్గా న్, డెలాయిట్, ఏఎండీ, నోవార్టిస్, సనోఫీ, సేల్స్ఫోర్స్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. కొత్తగా భారత్‌లో ప్రవేశిస్తున్న అనేక సంస్థ లు కూడా తొలుత హైదరాబాద్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి.
బెంగళూరుతో పోలిస్తే కా ర్యాలయ అద్దెలు, సిబ్బంది నిర్వహణ ఖర్చు లు తక్కువగా ఉన్నాయి. వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు, విశాలమైన రహదారులు, ప్రణాళికాబద్ధ నగరాభివృద్ధి హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నియోపోలిస్ ప్రాంతాల్లో భారీ క్యాంపస్‌ల ఏర్పాటుకు అనుకూలమైన భూములు అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు సింగిల్ విండో క్లియరెన్స్, వేగవంతమైన అనుమతులు, పెట్టుబడిదారుల కు అనుకూల విధానాలను అమలు చేస్తోం ది. ఉద్యోగుల మార్పిడి రేటు బెంగళూరుతో పోలిస్తే తక్కువగా ఉండటం కంపెనీలకు అదనపు ప్రయోజనంగా మారింది.
భవిష్యత్‌లో జీసీసీ హబ్‌గా గ్రేటర్..
రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద జీసీసీ హబ్‌గా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్‌టెక్, ఫార్మా రీసెర్చ్, డేటా సెంటర్ల రంగాల్లో హైదరాబాద్ వేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల భారీ క్యాంపస్‌లు నగరంలో ఉండటం కూడా కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తోంది.






