29 August, 2026 | 2:13 AM

కులగణన ప్రశ్నావళికి పరిమితుల్లేవు

29-08-2026 12:00 AM
  1. తప్పుదోవ పట్టించేలా ప్రశ్నల విధానం
  2. అంశంపై చర్చించేందుకు నేడు గాంధీభవన్‌లో సమావేశం
  3. ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు 

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): కులగణనలో ప్రశ్నావళికి పరిమితులు లేవని, ప్రశ్నల వి ధానం తప్పుదోవ పట్టించేలా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు ఆరోపించారు. ఈ అంశంపై శనివారం (నేడు) గాంధీభవన్‌లో బీసీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్‌లతోపాటు సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓబీసీలకు సంబంధించి కచ్చితమైన డేటా లేకపోతే విద్యా, ఉపాధి సంక్షేమం సరిగ్గా అమలయ్యే అవకాశం ఉండదని వీహెచ్ ఆరోపించారు.