15 June, 2026 | 8:44 PM

Breaking News

సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •  

30 కుటుంబాలు.. 38 ప్రభుత్వ ఉద్యోగులు

22-03-2026 12:06 AM

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఈశ్వర్ నగర్ పంచాయతీ పరిధిలోని  వాగాయి తండాలో 30 కుటుంబాలు.. 120 మంది జనాభా నివాసం ఉంటున్నారు. ఇంత చిన్న తండాలో 38 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. విద్యా, వైద్యం, పంచాయతీరాజ్, పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖలతో పాటు ఇతర శాఖలలో ఉద్యోగాలు చేస్తున్నారు.

ఇటీవల గ్రూప్ వన్ ఫలితాల్లో తండాకు చెందిన రాథోడ్ ప్రమోద్  డీఎస్పీగా ఉద్యోగం సాధించారు. అలాగే ఏడుగురు వైద్యులు, 17 మంది  ఉపాధ్యాయులుగా రాణిస్తున్నారు. వైద్య శాఖలో నలుగురు వివిధ ఉద్యోగాలు చేస్తుండగా, శాఖలు ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు మహిళా న్యాయవాది ఉన్నారు. వాగాయి తండాకు చెందిన రాథోడ్ రవీందర్ జిల్లా గ్రామీ ణ అభివృద్ధి (డీఆర్‌డీఓ), ఇన్‌చారిర్జ జడ్పీ సీఈవోగా జిల్లా ప్రజలకు సేవలందిస్తూనే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు పొందారు. 

ప్రథమ ఉద్యోగి రాథోడ్ సోమ్లా 

ఈ తండా నుంచి ప్రథమంగా దివ్యాంగుడైన రాథోడ్ సోమ్లా ఉమ్మడి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత గ్రామంలోని పిల్లలను  చదువుకోవాలని సూచనలు, సలహాలు చేయడంతో తండా నుంచి ఉన్నత విద్యను అభ్యసించి ప్రభు త్వ ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం తండాలో 15 మంది  పీజీలు చేస్తుండగా, పదిమంది డిగ్రీ చదువుతున్నారు. 23 మంది ఇంటర్, పదవ తరగతి చదువుతున్నారు. వీరితోపాటు ప్రతి ఇంటి నుంచి పిల్లలను సర్కారు బడిలో చదివిస్తున్నారు. 

 బండారి లక్ష్మీనర్సయ్య (ఉట్నూర్, విజయక్రాంతి)